ఆరు గ్యారెంటీలంటే... జనరేటర్లు, కొవ్వొత్తులే: కేటీఆర్‌

May 09, 2024


img

కాంగ్రెస్ పార్టీ  ఆరు గ్యారెంటీ పధకాలను అమలుచేయలేకపోగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగు త్రాగునీరు, విద్యుత్ సరఫరా చేయలేకపోతోందని బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఆ పార్టీ నేతలందరూ విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం గరిష్టస్థాయికి చేరింది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో విద్యుత్ కోతలు మొదలయ్యాయి.

కనుక రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ జనరేటర్లు, ఇన్‌వర్టర్లు, చార్జింగ్ లైట్లు, పవర్ బ్యాంక్స్, టార్చ్ లైట్లు, కొవ్వొత్తులు సిద్దంగా ఉంచుకోవాలని, కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవేనంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా ఓ మెసేజ్ పెట్టారు.

ఇది బిఆర్ఎస్‌ ప్రభుత్వం కాదు కాంగ్రెస్‌ ప్రభుత్వమని అందరూ గుర్తుంచుకోండి. మే 13న విజ్ఞతతో ఆలోచిఓంచి ఓట్లు వేయాలని కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సాగు, త్రాగునీరు, విద్యుత్ కోతలపై బిఆర్ఎస్‌ నేతలు ఇంతగా విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిపై స్పందించకుండా, ప్రజలకు సంతృప్తికరమైన జవాబు చెప్పకుండా ఎన్నికల ప్రచారంలో వేరే అంశాల గురించి మాట్లాడుతోంది. దీంతో బిఆర్ఎస్‌ చేస్తున్న ఆరోపణలు నిజమే అని కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లే అవుతోంది కదా?


Related Post