నాగోల్-చాంద్రాయణగుట్ట మద్య 13 మెట్రో స్టేషన్లు: ఎన్వీఎస్ రెడ్డి

April 28, 2024


img

హైదరాబాద్‌ మెట్రో కారిడార్‌ను శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. దానికి అనుసంధానం చేస్తూ నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో కారిడార్‌ నిర్మించబోతున్నారు.

ఈ రెండు ప్రాంతాల మద్య 14 కిలో మీటర్లు ఉండగా వాటి మద్య మొత్తం 13 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయైంచామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. 

నాగోల్ నుంచి నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆస్పత్రి, ఎల్బీ నగర్‌ చౌరస్తా, సాగర్ రింగ్ రోడ్, మైత్రీనాగర్, కర్మాన్ ఘాట్, చంపాపేట జంక్షన్, ఓవైసీ ఆస్పత్రి, డిఆర్డీవో, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించబోతున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 

చాంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్ ఇంటర్ చేంజ్ స్టేషన్‌గా నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో మూసీ నది, హెచ్‌టి విద్యుత్ లైన్లు, బైరామల్ గూడా వద్ద ఫ్లైఓవర్లు ఉన్నందున అవసరమైన చోట మెట్రో మార్గం అలైన్మెంట్ మార్పులు చేర్పులు చేసుకొని నిర్మిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

నాగోల్-చాంద్రాయణగుట్ట మద్య నిర్మించబోతున్న 13 మెట్రో స్టేషన్లకు తగిన పేర్లు సూచించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సంబందిత అధికారులతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కాలినడకన ఆయా ప్రాంతాలలో తిరిగి పరిశీలించారు. అధికారులు అక్కడే డ్రాయింగ్‌లో మార్పులు చేర్పులను నోట్ చేసుకున్నారు.


Related Post