మాధవీలత ఆస్తులు 200 కోట్లు పైనే!

April 25, 2024


img

లోక్‌సభ ఎన్నికలలో హైదరాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలత నామినేషన్స్‌ వేయడంతో ఆమె ఆస్తులు, అప్పుల వివరాలు బయటకు వచ్చాయి. ఆమె ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తమ కుటుంబానికి మొత్తం రూ.221.37 కోట్లు విలువగల స్థిర చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.

వాటిలో చరాస్తుల విలువ రూ.165.46 కోట్లు అని పేర్కొన్నారు. తమ వద్ద 5 కేజీల బంగారు నగలు ఉన్నాయి కానీ కార్లు, వ్యవసాయ భూములు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

వినో బయోటెక్, విరించి లిమిటెడ్ కంపెనీలలో తన పేరిట రూ.8.92 కోట్లు విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాధ్ పేరిట రూ.56.19 కోట్లు విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు.  ఆన్‌లిస్టడ్ కంపెనీలైన వీరా సిస్టమ్స్, పీకేఐ సొల్యూషన్స్, గజ్వేల్ డెవలపర్స్ కంపెనీలలో తనకు రూ.16.27 కోట్లు, తన భర్తకు రూ.29.56 కోట్లు విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. 

మాధవీలత హిందూమత ప్రచారం, ప్రసంగాలనే కాక ఆమెకున్న ఈ ఆర్ధిక బలాన్ని కూడా బీజేపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకునే ఆమెను పార్టీలో చేర్చుకొని టికెట్‌ ఇచ్చిన్నట్లు భావించవచ్చు.

ఆమె ఆర్ధికంగా ఇంత శక్తిమంతురాలు కనుకనే ఎన్నికల ప్రచార ఖర్చులకు వెనకాడటం లేదని భావించవచ్చు. కానీ ఆమె హిందుత్వ వాదనలు, ఆర్ధికశక్తి ఆమెను ఎంపీగా గెలిపించగలవా లేదా? అనేది జూన్ 4న ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది.


Related Post