హరీష్, రేవంత్‌ సవాళ్ళకు కట్టుబడి ఉండగలరా?

April 24, 2024


img

రాజకీయ నాయకులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవడం పరిపాటే. కానీ ఒక్కోసారి అవే వారికి చాలా ఇబ్బందికరంగా మారుతుంటాయి. 

సిఎం రేవంత్‌ రెడ్డి ఆగస్ట్ 15లోగా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ, “శాసనసభ ఎన్నికలలో కూడా ఇలాగే అది చేస్తాం... ఇది చేస్తాం అంటూ చాలా అబద్దాలే చెప్పారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో పంట రుణాల మాఫీ చేస్తామంటూ మరో కొత్త అబద్దం చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఆగస్ట్ 15లోగా పంట రుణాలు మాఫీ చేయకపోతే మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? చేస్తానని చెప్పగలరా?” అని హరీష్ రావు సవాలు విసిరారు. 

దీనిపై సిఎం రేవంత్‌ రెడ్డి మళ్ళీ స్పందిస్తూ, ఆగస్ట్ 15లోగా పంట రుణాలు మాఫీ చేస్తే మీరు మీ బిఆర్ఎస్ పార్టీని మూసేసి రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్దమేనా?” అని ప్రతి సవాలు విసిరారు. 

హరీష్ రావు చెప్పిన్నట్లు లోక్‌సభ ఎన్నికలలో ఓట్ల కోసమే సిఎం రేవంత్‌ రెడ్డి పంట రుణాల మాఫీ చేస్తామని చెపుతున్నారని అర్దమవుతూనే ఉంది. కనుక ఈ హామీ కూడా అబద్దం అని నిరూపింపపజేసేందుకు లేదా ఈ హామీ నుంచి రేవంత్‌ రెడ్డి తప్పించుకోలేకుండా ‘లాక్’ చేసేందుకే హరీష్ రావు ప్రతి సవాలు విసిరిన్నట్లు భావించవచ్చు.

కానీ రేవంత్‌ రెడ్డి ఈవిదంగా ప్రతి సవాలు విసరడం ద్వారా ఆయన ఉచ్చులో చిక్కుకోకుండా తప్పించుకుంటూనే, ఈ హామీకి తాము కట్టుబడి ఉంటామనే నమ్మకం ప్రజలకు కల్పించే ప్రయత్నం చేసిన్నట్లు అర్దమవుతోంది. కానీ ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు వారు ఎన్నడూ కట్టుబడి ఉండేది లేదు వాటి వలన ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదని చెప్పవచ్చు. 


Related Post