తెలంగాణలో బీజేపీ మొదటి రెండు స్థానాల్లోనే ఉంటుందట!

April 07, 2024


img

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “ప్రస్తుతం బీజేపీని ఎదుర్కోగల పార్టీ, కూటమి రెండూ దేశంలో లేవు కనుక ఈసారి కూడా బీజేపీ 300కి పైగా సీట్లు సాధించి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. కానీ బీజేపీ చెపుతున్నట్లు 370-400 సీట్లు సాధించే అవకాశం మాత్రం ఉండదు. 

బీజేపీ తెలంగాణలో కూడా మొదటి రెండు స్థానాలలోనే నిలుస్తుంది. తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలలో ఈసారి బీజేపీ ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కూడా బీజేపీ మంచి పురోగతి సాధించబోతోంది. 

ఇందుకు కారణం బీజేపీ హిందీ రాష్ట్రాలలో పూర్తి పట్టు సాధించడం. అదే సమయంలో కాంగ్రెస్‌, దాని కూటమి అనేక తప్పుడు వ్యూహాలు, బద్దకం, నిర్లక్ష్యం కారణంగా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకొని ఇంకా బలహీనపడ్డాయి. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో ప్రధాన మోడీ చాలా అప్రదిష్ట మూటగట్టుకున్నారు. కానీ అప్పుడు ప్రతిపక్ష నేతలందరూ ఇళ్ళలో చేతులు ముడుచుకొని కూర్చుండిపోతే, ప్రధాని మోడీ ఆ అవకాశాన్ని, ఆ సమయాన్ని చాలా తెలివిగా వినియోగించుకొని మళ్ళీ మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రతిపక్షాల తీరు నేటికీ మారలేదు. కనుక అవి బీజేపీని ఎదుర్కొని పోరాడలేని దుస్థితిలో ఉన్నాయి. 

అయితే మళ్ళీ మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినంత మాత్రన్న అది ఇంకా బలపడిపోతుందని, ఇక దానిని ఎవరూ ఎన్నటికీ ఓడించలేరనుకోవడం కూడా పొరపాటే,” అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.


Related Post