భువనగిరి, నల్గొండకు కూడా బిఆర్ఎస్ అభ్యర్ధులు ఖరారు

March 23, 2024


img

బిఆర్ఎస్ పార్టీకి ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా లోక్‌సభ ఎన్నికల విషయంలో చాలా దూకుడుగానే వ్యవహరిస్తుండటం విశేషం. ఈరోజు సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ పేరు ప్రకటించిన కొన్ని గంటలకే నల్గొండ, భువనగిరి స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటించింది.

నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేశ్ బిఆర్ఎస్ అభ్యర్ధులుగా పోటీ చేయబోతున్నారని కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు.

దీంతో ఒక్క హైదరాబాద్‌ స్థానానికి తప్ప మిగిలిన 16 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినట్లయింది.

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మజ్లీస్‌ మిత్రపక్షంగా ఉండేది కనుక ఆ సీటుని మజ్లీస్‌కు విడిచిపెడుతుండేవారు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌కు అభ్యర్ధిని ప్రకటించకుండా స్నేహం కొనసాగిద్దామని సంకేతం ఇస్తున్నట్లే భావించవచ్చు.

అయితే మజ్లీస్‌ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోంది కనుక ఒకవేళ మజ్లీస్‌ ఈ సంకేతానికి స్పందించకపోతే హైదరాబాద్‌కు బిఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల వివరాలు:     

 

నియోజకవర్గం

అభ్యర్ధి

1

మల్కాజ్‌గిరి

రాగిడి లక్ష్మారెడ్డి

2

ఆదిలాబాద్‌

ఆత్రం సక్కు

3

కరీంనగర్‌

బి.వినోద్ కుమార్‌

4

పెద్దపల్లి (ఎస్సీ)

కొప్పుల ఈశ్వర్

5

ఖమ్మం

నామా నాగేశ్వర రావు

6

మహబూబాద్

మాలోత్ కవిత

7

మహబూబ్ నగర్‌

మన్నే శ్రీనివాస్ రెడ్డి

8

వరంగల్‌ (ఎస్సీ)

డాక్టర్ కడియం కావ్య

9

జహీరాబాద్

గాలి అనిల్ కుమార్‌

10

నిజామాబాద్‌

బాజిరెడ్డి గోవర్ధన్

11

చేవెళ్ళ

కాసాని జ్ఞానేశ్వర్

12

మెదక్

వెంకట్రామి రెడ్డి

13

నాగర్‌కర్నూల్‌

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

14

సికింద్రాబాద్‌

టి.పద్మారావు గౌడ్

15

హైదరాబాద్‌

ఇంకా ప్రకటించవలసి ఉంది

16

భువనగిరి

క్యామ మల్లేశ్

17

నల్గొండ

కంచర్ల కృష్ణారెడ్డి


Related Post