లోక్‌సభ ఎన్నికలకు వరుసపెట్టి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేస్తున్న కేసీఆర్ శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గానికి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరుని ఖరారు చేశారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన అదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసిన్నట్లయితే అవలీలగా విజయం సాధించగలరని కేసీఆర్ అభిప్రాయపడి ఆయన పేరు ఖరారు చేశారు.
ఇటీవల ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆయనను సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయించబోతోంది.
కనుక దానం నాగేందర్, బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డిలను ఎదుర్కోవడానికి పద్మారావు గౌడ్ వంటి సీనియర్ నాయకుడే సరైనవారని కేసీఆర్ భావించి ఆయనను అభ్యర్ధిగా ఖరారు చేశారు.
లోక్‌సభ ఎన్నికలలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేయబోతున్నారు కనుక వారిలో ఎవరు నెగ్గినా వారి శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరం అవుతుంది.
ఒకవేళ వారు ఎన్నికలకు ముందే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన్నట్లయితే రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిపించవలసి ఉంటుంది.
|
|
నియోజకవర్గం |
అభ్యర్ధి |
|
1 |
మల్కాజ్‌గిరి |
రాగిడి లక్ష్మారెడ్డి |
|
2 |
ఆదిలాబాద్ |
ఆత్రం సక్కు |
|
3 |
కరీంనగర్ |
బి.వినోద్ కుమార్ |
|
4 |
పెద్దపల్లి (ఎస్సీ) |
కొప్పుల ఈశ్వర్ |
|
5 |
ఖమ్మం |
నామా నాగేశ్వర రావు |
|
6 |
మహబూబాద్ |
మాలోత్ కవిత |
|
7 |
మహబూబ్ నగర్ |
మన్నే శ్రీనివాస్ రెడ్డి |
|
8 |
వరంగల్ (ఎస్సీ) |
డాక్టర్ కడియం కావ్య |
|
9 |
జహీరాబాద్ |
గాలి అనిల్ కుమార్ |
|
10 |
నిజామాబాద్ |
బాజిరెడ్డి గోవర్ధన్ |
|
11 |
చేవెళ్ళ |
కాసాని జ్ఞానేశ్వర్ |
|
12 |
మెదక్ |
వెంకట్రామి రెడ్డి |
|
13 |
నాగర్‌కర్నూల్ |
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ |
|
14 |
సికింద్రాబాద్ |
టి.పద్మారావు గౌడ్ |
|
15 |
హైదరాబాద్ |
ఇంకా ప్రకటించవలసి ఉంది |
|
16 |
భువనగిరి |
ఇంకా ప్రకటించవలసి ఉంది |
|
17 |
నల్గొండ |
ఇంకా ప్రకటించవలసి ఉంది |