కవిత నేరం చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదు?

March 16, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేయడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఆమె అరెస్టుకి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నారు. 

బిఆర్ఎస్ పార్టీని ఒత్తిడికి గురిచేసి లోక్‌సభ ఎన్నికలలో దెబ్బ తీసేందుకే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందు కల్వకుంట్ల కవిత అరెస్టు చేయించిందని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

వాటిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. ఈ అరెస్టుతో కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎటువంటి సంబందమూ లేదని అన్నారు.  ఒకవేళ ఆమె నిరపరాధి అని భావిస్తున్నట్లయితే ఈడీ విచారణకు హాజరు కాకుండా కోర్టులో కేసులు వేస్తూ ఎందుకు తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు? 

ఈడీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు చేస్తే ఎందుకు ఆందోళన చెందుతున్నారు?కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు ఈడీ అధికారులను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు? ఒకవేళ ఆమె నిరపరాధే అయితే ధైర్యంగా ఈడీని ఎదుర్కొని తన నిజాయితీ నిరూపించుకొని ఈ కేసు నుంచి నిర్ధోషిగా బయటపడవచ్చు కదా?కానీ మీరు తప్పులు చేసి రాజకీయ కుట్ర అంటూ మా పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు బురద జల్లుతున్నారు?” అని ప్రశ్నించారు.


Related Post