మోడీ మళ్ళీ వారణాశి నుంచే లోక్‌సభకు పోటీ

March 03, 2024


img

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ 195 మంది అభ్యర్ధులతో తొలి జాబితా శుక్రవారం రాత్రి విడుదల చేసింది. దానిలో తెలంగాణలోని 17 స్థానాలకు 9 మంది అభ్యర్ధులను ప్రకటించింది. 

గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో చెరో 15 స్థానాలకు, ఛత్తీస్‌ఘడ్‌, ఝార్ఖండ్, అస్సాం, కేరళ రాష్ట్రాలలో చెరో 11 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్‌లో చెరో 2 స్థానాలకు, గోవా, త్రిపుర రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ అండ్ నికోబార్, డామన్ అండ్ డీయూలో చెరో ఒక్క స్థానానికి, తెలంగాణ: 9, ఢిల్లీ: 5, ఉత్తరాఖండ్:3 కలిపి మొత్తం 195 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది.

ఏపీలో టిడిపి, జనసేనలతో పొత్తుల విషయంలో ఇంకా సందిగ్ధం నెలకొని ఉన్నందున ఏపీకి అభ్యర్ధులను ప్రకటించలేదు. 

తొలి జాబితాలో ప్రముఖులు, వారు పోటీ చేయబోతున్న నియోజకవర్గాలు... 

ప్రధాని నరేంద్రమోడీ: వారణాసి (యూపీ), అమిత్ షా: గాంధీ నగర్‌ (గుజరాత్‌), రాజ్‌నాధ్ సింగ్‌: లక్నో (యూపీ), స్మృతీ ఇరానీ: అమేధీ (యూపీ), హేమ మాలిని: మధుర (యూపీ), మధ్యప్రదేశ్ మాజీ సిఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్: విధిష (మధ్య ప్రదేశ్), భూపేదర్ యాదవ్‌: ఆళ్వార్ (రాజస్థాన్‌), గజేంద్ర సింగ్‌ షికావత్: జోద్ పూర్ (రాజస్థాన్‌), రాజీవ్ చంద్రశేఖర్: తిరువనంతపురం (కేరళ), లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా: కోటా (రాజస్థాన్‌) నుంచి పోటీ చేయబోతున్నారు. 

తెలంగాణలో కిషన్ రెడ్డి: సికింద్రాబాద్‌, మాధవీలత: హైదరాబాద్‌, బండి సంజయ్‌: కరీంనగర్‌, ధర్మపురి అరవింద్: నిజామాబాద్‌, ఈటల రాజేందర్‌: మల్కాజ్‌గిరి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి: చేవెళ్ళ, బూర నర్సయ్య గౌడ్: భువనగిరి, బీబీ పాటిల్: జహీరాబాద్, పి.భరత్: నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేయబోతున్నారు. మిగిలిన 8 స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్ధులను ప్రకటించనుంది. 


Related Post