భారత్‌లో అతి పొడవైన కేబిల్ బ్రిడ్జ్ ద్వారకలో ప్రారంభోత్సవం

February 25, 2024


img

భారత్‌లో అతి పొడవైన తీగల వంతెన (కేబిల్ బ్రిడ్జ్)ని ప్రధాని నరేంద్రమోడీ నేడు ప్రారంభోత్సవం చేశారు. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని ఓఖా- ద్వారక పట్టణాలను కలుపుతూ తీగల వంతెనను రూ.979 కోట్లు వ్యయంతో నిర్మించారు. దీనికి 2017 అక్టోబరులో మోడీ శంకుస్థాపన చేయగా నేటికీ నిర్మాణ పనులన్నీ పూర్తిచేసుకొని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 

దీనికి ‘సుదర్శన్ సేతు’ అని నామకరణం చేశారు. ఈ వంతెన పొడవు 2.3 కిమీ, వెడల్పు 27.20 మీటర్లు. వాహనాల కోసం నాలుగు లేన్లతో నిర్మించిన ఈ తీగల వంతెనపై పాదాచారులు నడిచివెళ్ళేందుకు వీలుగా  ఇరువైపులా 2.5 మీటర్లు వెడల్పుతో ఫుట్‌పాత్‌లు కూడా నిర్మించారు. వంతెన పొడవునా భగవత్ గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడు చిత్రాలను అమర్చారు. 

భారీ భూకంపాలను కూడా తట్టుకొని మరో 100-200 ఏళ్ళు ధృడంగా నిలబడేలా దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు.

గుజరాత్‌, పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో రూ.6,300 కోట్లు వ్యయంతో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రులను కూడా నేడు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవాలు చేశారు.            Related Post