తెలంగాణ బడ్జెట్‌ 2.76 లక్షల కోట్లు... 53 వేల కోట్లు వాటికే!

February 10, 2024


img

తెలంగాణ ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం మధ్యాహ్నం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ విలువ మొత్తం రూ.2,75, 891 కోట్లు. ఊహించిన్నట్లే దానిలో రూ.53,196 కోట్లు ఆరు గ్యారెంటీ పధకాలకు కేటాయించారు.

బడ్జెట్‌లో ముఖ్యాంశాలు: రెవెన్యూ వ్యయం: రూ. 2,01,178 కోట్లు; మూలధన వ్యయం: రూ. 29,669 కోట్లు. 

త్వరలోనే అర్హులైన వారికి గృహజ్యోతి పధకంలో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్స్ అందజేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ హామీని అమలు చేసేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి బృందం దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు వస్తున్నాయని చెప్పారు.  



Related Post