కేసీఆర్‌ వచ్చారు... ఇక ఆట మొదలవుతుంది: పాడి కౌశిక్

February 01, 2024


img

సుమారు రెండు నెలల తర్వాత కేసీఆర్‌ తొలిసారిగా శాసనసభకు వచ్చి గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను చూసి బిఆర్ఎస్ శ్రేణులు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాయి. అది సహజమే. అయితే హుజూరాబాద్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సిఎం రేవంత్‌ రెడ్డి, ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

“కేసీఆర్‌ వచ్చారు కనుక ఇక ఆట మొదలవుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సినిమా చూపిస్తామని పాడి కౌశిక్ హెచ్చరించారు. సిఎం రేవంత్‌ రెడ్డి నిన్న నియామక పత్రాలు అందజేసిన నర్సులందరికీ తమ ప్రభుత్వం హయాంలోనే రాత పరీక్షలు వగైరా పూర్తిచేశామని, వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోలేదని పాడి కౌశిక్ అన్నారు. 

రేవంత్‌ రెడ్డి అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఆయనకు దమ్ముంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేయాలి. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ రేవంత్‌ రెడ్డి మళ్ళీ నిన్న మరో అబద్దం చెప్పారు. ఏవిదంగా, ఎప్పటిలోగా  భర్తీ చేస్తారో చెప్పాలి.

రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నపుడే పార్టీ నేతలు ఎవరికీ అందుబాటులో ఉండేవారు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉండటం లేదు,” అంటూ పాడి కౌశిక్ చెలరేగిపోయారు. 

 రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతీరోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను కలుస్తూనే ఉన్నారు. ప్రతీ కార్యక్రమంలో అందరితో కలిసే పాల్గొంటున్నారఏ సంగతి అందరికీ తెలుసు. నిన్న గద్దర్ జయంతి కార్యక్రమం రేవంత్‌ రెడ్డి మంత్రులతో కలిసి పాల్గొన్నారు. 

రెండు లక్షల ఉద్యోగాలను 12 నెలల్లోగా భర్తీ చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పిన విషయాన్ని పాడి కౌశిక్‌కు తెలిసిన్నట్లు లేదు. రేవంత్‌ రెడ్డి పనితీరు, వ్యవహర్ శైలి పట్ల ప్రొఫెసర్ ఐలయ్య వంటివారు సైతం ప్రశంసలు కురిపిస్తుంటే, పాడి కౌశిక్ తప్పు పడుతుండటం, అనుచితంగా మాట్లాడటం ద్వారా బిఆర్ఎస్ ట్రేడ్ మార్క్ అహంభావన్ని మరోసారి బయటపెట్టుకున్నట్లుంది.


Related Post