తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు కూడా దావోస్ వెళ్ళారు.
తద్వారా వారి బృందం తెలంగాణలో మారిందే తప్ప ప్రభుత్వ వైఖరి, విధానాలు మారలేదనే మంచి సంకేతమే ఇచ్చిన్నట్లయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎప్పటిలాగే ప్రభుత్వం తరపున సహాయసహకారాలు, ప్రోత్సాహాకాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని రేవంత్ బృందం స్పష్టం చేసిన్నట్లయింది.
అయినప్పటికీ భారత్‌లో ప్రభుత్వాలు మారితే కొత్త ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంటుందనే భయం పెట్టుబడిదారులలో ఉన్నట్లుంది. బహుశః అందుకే ఇంతవరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదనుకోవచ్చు.
కానీ రేవంత్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు మంచి సంకేతమే ఇచ్చింది. దావోస్ సదస్సులో చాలా మందితో రేవంత్ బృందం ముఖాముఖీ సమావేశమయ్యింది. కనుక వారి ప్రయత్నాలు వృధా కావు. తర్వాత అయినా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
ఈ సదస్సులో రేవంత్ బృందం హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీ4ఐఆర్)ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో జరుగబోయే బయో ఏసియా-2024 సదస్సులో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.