కోరుట్లలో కరెంట్ షాకుతో బాలుడు మృతి

January 16, 2024


img

కోరుట్ల పట్టణంలో కల్లూరుకి చెందిన ఇద్దరు బాలురు సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుండగా  కరెంట్ షాక్ తగిలింది. వారిద్దరి వయసు 12 ఏళ్ళే. ఇద్దరూ నిన్న ఉదయం ఇంటి మేడ మీద గాలిపటాలు ఎగురవేస్తుంటే అవి కరెంట్ తీగలకు చుట్టుకోవడంతో ఇద్దరికీ షాక్ తగిలింది. ఆ ధాటికి ఇద్దరు పిల్లలు మేడపై నుంచి క్రిందపడిపోయారు.

వారిలో ఒక పిల్లాడికి 50 శాతంపైగా కాలిన గాయాలతో వెంటనే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందున్న మరొక బాలుడి పరిస్థితి చాలా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ఏటా సంక్రాంతికి సమయంలో తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు పండుగ హడావుడిలో ఉండి పిల్లలను  గమనించరు. దీంతో పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు తరచూ ఇటువంటి విషాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 


Related Post