అనసూయ... మరో రాంగోపాల్ వర్మ?

June 17, 2023


img

టీవీ షోలో యాంకర్ నుంచి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అనసూయ ఒక మంచి నటిగా నిరూపించుకొని అందరి మన్ననలు పొందుతున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ ప్రశ్నించవద్దని కోరుకోతున్న అనసూయ భర్తతో ముద్దులు, కౌగిలింతలు, బీచ్‌లో బికినీ షో ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుండటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 

ఆమె ఉద్దేశ్యపూర్వకంగానే నెటిజన్స్ తనని కామెంట్స్ చేసేలా చేసుకొని వివాదాలు సృష్టించుకొంటూ వాటితో ఎల్లప్పుడూ అందరి దృష్టిలో పడుతుండాలని కోరుకొంటున్నట్లున్నారనిపిస్తుంది. లేకుంటే సోషల్ మీడియాలో అటువంటి ఫోటోలు, వ్యాఖ్యలు పోస్ట్ చేయాల్సిన అవసరమే లేదు కదా?

ఆమెకు నటన చేతకాదు... కనుక సినిమా అవకాశాలు రావడం లేదనుకోవడానికి కూడా లేదు. పుష్ప వంటి భారీ బడ్జెట్‌ సినిమాలలో ఆమెకు కీలకపాత్రలు లభిస్తున్నాయి. మద్యలో హీరోయిన్‌ ఓరియంటడ్ మూవీలు కూడా చేస్తూ మంచి పేరు సంపాదించుకొంటున్నారు. అయినా అనసూయ ఈ వయసులో ఇంత ఎబ్బెట్టుగా అందాల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు?సోషల్ మీడియాలో నిత్యం వివాదాలలో ఎందుకు ఉంటున్నారు?అంటే బహుశః ఇతర నటీమణుల నుంచి పోటీ ఎక్కువగా ఉండటం వలన కావచ్చు. 

సాధారణంగా వయసు పెరిగిన హీరోయిన్లకు సినిమా అవకాశాలు తగ్గుతున్నప్పుడు ఈవిదంగా అందాల ప్రదర్శన చేస్తూ ‘మేము ఇంకా హాట్‌గానే ఉన్నామని’ చాటింపు వేసుకోవడం అందరికీ తెలిసిందే. కనుక అనసూయ కూడా ఇండస్ట్రీలో ఇతర నటీమణుల నుంచి పోటీని తట్టుకొంటూ నిలబడటానికే ఈవిదంగా అందాల ప్రదర్శనలు చేస్తూ, సోషల్ మీడియాలో వివాదాలలో మునిగి తేలుతున్నారేమో? అనే సందేహం కలుగుతోంది. 

ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎవరు బాగా పాపులర్‌గా ఉంటారో వారికే సినీపరిశ్రమ ప్రాధాన్యం ఇస్తుంటుందని అందరికీ తెలుసు. కనుక అనసూయ ఈ మార్గాన్ని ఎంచుకొన్నట్లున్నారు. కానీ ఆమె స్థాయి నటి ఇంత దిగజారవలసిన అవసరం ఉందా? చివరికి ఆమె కూడా రాంగోపాల్ వర్మలా చులకనైపోయినా ఆశ్చర్యం లేదు. 


Related Post