మునుగోడులో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం అందుకే...

October 22, 2022


img

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం పార్టీలో తన అనుచరులకు స్వయంగా ఫోన్లు చేసి పార్టీలను పట్టించుకోకుండా బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికె ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఆ ఫోన్‌ సంభాషణలు లీక్ అయ్యి పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అవింకా సద్దుమనగక మునుపే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మళ్ళీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం ఖాయమని, ఓడిపోయే పార్టీ కోసం తాను ఎన్నికల ప్రచారం చేసి ఎమ్మెల్యే ప్రయోజనం?అందుకే తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని అన్నారు. అయినా కాంగ్రెస్‌ పార్టీలో అనేక గ్రూపులు ఉన్నాయని కనుక తాను ప్రచారానికి దూరంగా ఉండిపోయానని అన్నారు. ఒకవేళ తాను ప్రచారం చేసిన మహా అయితే ఓ పదివేల ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి పడతాయేమో కానీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. రెండు అధికార పార్టీల మద్య జరుగుతున్న ఈ రాజకీయపోరు మద్యలో తాను దూరి చేసేదేముంటుందని ప్రశ్నించారు. గత 25 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నాను. ఇక రాజకీయాలు చాలు,” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 

పిసిసి అధ్యక్షుడు పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కష్టకాలంలో పార్టీకి సహకరించకుండా దూరంగా ఉండటమే కాకుండా, ఈవిదంగా పార్టీకి నష్టం కలిగించేవిదంగా వ్యవహరిస్తుంటే, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లమని చెప్పుకొనేవారెవరూ నోరు విప్పకుండా చోద్యం చూస్తున్నారు.


Related Post