తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో నిలుస్తున్న నగరం వరంగల్. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ళలో వరంగల్ నగరాన్ని మరెంతో అభివృద్ధి చేసింది. ఒకప్పుడు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఐటి పార్కులు, పార్కులు, ఫ్లైఓవర్లు, అవుటర్ రింగ్ రోడ్, సువిశాలమైన రోడ్లు ఇప్పుడు వరంగల్ నగరంలో కూడా కనిపిస్తున్నాయి. వరంగల్ నగరానికి మణిహారం వలె కాకతీయ కెనాల్, భద్రకాళి బండ్ పార్క్, కేయూ ఎక్స్ రోడ్ జంక్షన్, అంబేడ్కర్ సర్కిల్, హంటర్ రోడ్ సర్కిల్, వరంగల్ ఓఆర్ఆర్, ప్రజలకు విజ్ఞానం, నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న రీజినల్ లైబ్రెరీ, ఇంకా భద్రకాళి ఆలయం, మసీదులు, చర్చిలు, పచ్చదనం పరుచుకొన్న నగరాన్ని చూసి తీరాల్సిందే.
వరంగల్ నగరం అందలాను సదానంద సోల్తి, నితిన్ సోల్తి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి పోలీస్ శాఖ అనుమతితో 20 రోజులు ఎంతగానో శ్రమించి డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. వరంగల్ నగరం అందాలను మీరు చూసి ఆనందించండి... దేశవిదేశాలలో ఉన్న మీ బంధుమిత్రులకు కూడా పంపి మన వరంగల్ నగరం ఎంత అద్భుతంగా ఉందో సగర్వంగా తెలియజేయండి.