కేసీఆర్‌ జాతీయ రాజకీయ ప్రవేశం మూడు నెలలు వాయిదా?

September 22, 2022


img

సిఎం కేసీఆర్‌ వచ్చేనెల 5వ తేదీన విజయ దశమినాడు తాను స్థాపించబోయే జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటించి జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలనుకొన్నారు. కానీ పార్టీకి సంబందించిన పనులు పూర్తికాకపోవడంతో ఈ ఏడాది డిసెంబర్‌ వరకు వాయిదా వేసుకోకతప్పడం లేదని తాజా సమాచారం. అదీగాక నవంబర్‌లో మునుగోడు ఉపఎన్నికలు ఉండవచ్చని కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. కనుక దానిలో తమ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకొన్నాక ఢిల్లీలో అడుగుపెడితే అప్పుడు బిజెపి గురించి మరింత గట్టిగా మాట్లాడేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ డిసెంబర్‌నాటికి కొత్త సచివాలయం నిర్మాణ పనులు పూర్తి చేసుకొని అందుబాటులోకి రాగలిగితే అక్కడికి మిత్రపక్షాల నేతలను ఆహ్వానించి వారి కరతాళ ధ్వనుల మద్య జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. కనుక సిఎం కేసీఆర్‌ ఈ విషయంలో తొందరపడకుండా అన్ని సానుకూలంగా ఉన్నప్పుడే జాతీయ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడం మంచి భావిస్తున్నట్లు తెలుస్తోంది.          Related Post