శాసనసభ స్థానాల పెంపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌

September 20, 2022


img

ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఓ రిట్ పిటిషన్ వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలను 153కి, అలాగే  ఏపీలో 175 స్థానాలను 225కి పెంచాలని కేంద్రాన్ని ఆదేశించవలసిందిగా ఆయన పిటిషన్‌ ద్వారా కోరారు. సుప్రీంకోర్టు దీనిని విచారణకు స్వీకరించిందని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను కోరినప్పుడు దీని కోసమే చిరకాలంగా ఎదురుచూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తాయని తెలుసు. కానీ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా సీట్ల పెంపు కోసం పట్టుబడితే అప్పుడు కేంద్రానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే తేనెతుట్టె వంటి ఈ ప్రతిపాదనను 2026 వరకు అమలుచేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే చెప్పేసింది. అయినప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైనందున, కేంద్ర ప్రభుత్వం మరోసారి తన అభిప్రాయం చెప్పకతప్పదు. బహుశః మళ్ళీ అదే సమాధానం చెప్పవచ్చు. Related Post