నాకు ఈడీ నోటీసులు రాలేదు: కల్వకుంట్ల కవిత

September 16, 2022


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బృందాలు ఈరోజు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాలలో ఒకేసారి సోదాలు నిర్వహించాయి. వాటిలో హైదరాబాద్‌ కూడా ఉంది. టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లావాదేవీలను ఆడిటింగ్ చేసే గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశాయి. దీంతో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె వెంటనే స్పందిస్తూ, “ఢిల్లీలో కూర్చోన్న కొందరు వ్యక్తులు మీడియాకు లీకులు ఇస్తూ తప్ప్ దోవ పట్టిస్తున్నారు. కనుక ఇటువంటి అసత్యాలు ప్రసారం చేయకుండా నిజమైన విషయాలపై దృష్టి పెట్టాలని నేను మీడియా మిత్రులందరికీ నాకు ఈడీ నుంచి ఎటువంటి నోటీసులు రాలేదు. టీవీ ప్రేక్షకుల అమూల్యమైన సమయం వృధా కాకూడదనే ఉద్దేశ్యంతో నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీట్ చేశారు. 

అయితే హైదరాబాద్‌లో ఈడీ మళ్ళీ సోదాలకు రావడం ద్వారా ఏమి కనుగొందో తెలీదు కానీ ఈ సోదాలతో కల్వకుంట్ల కవిత, కేసీఆర్‌, కేటీఆర్‌, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతారనే విషయం కేంద్రానికి తెలుసు. కవిత మాటలలోనే ఈ విషయం బయట పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో కల్వకుంట్ల కవితకు నిజంగా సంబందం ఉందో లేదో తెలీదు కానీ కేంద్రంపై కత్తులు దూస్తూ యుద్ధం ప్రకటించినందున దానిని ఎదుర్కోక తప్పదు. అది ఏవిదంగా ఉన్నా సరే!



Related Post