అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ శుక్రవారం గణేశ్ నిమజ్జనం కార్యక్రమాలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో ఇక్కడ తెలంగాణలో, అక్కడ కేంద్రంలో మళ్ళీ బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. మాకు ప్రత్యేకమైన అస్త్రాలు ఏమీ లేవు. ప్రధాని నరేంద్రమోడీయే మా బ్రహ్మాస్త్రం. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసే దేశ ప్రజలు మళ్ళీ బిజెపికి పట్టం కడతారు. తెలంగాణ సిఎం కేసీఆర్ వద్ద చాలా డబ్బు ఉంది కనుకనే జాతీయ పార్టీ పెడుతున్నారు. అందుకు మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేదే మా ప్రశ్న. తెలంగాణ ప్రజలే ఆయన మాటలను నమ్మడం లేదు. ఇక దేశప్రజలు ఎలా నమ్ముతారు? కేసీఆర్ సెప్టెంబర్ 17న ముందుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలి ఆ తర్వాత ఆయన ఏ పేరుతో ఉత్సవాలు చేసుకొన్నా ఎవరికీ అభ్యంతరం లేదు,” అని అన్నారు.