ప్రధాని నరేంద్రమోడీకి తలసానితో స్వాగతం

February 04, 2022


img

ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్‌ రాబోతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి విమానాశ్రాయానికి వెళ్ళి ప్రధానికి స్వాగతం చెప్పడం ఆనవాయితీ. కానీ గత కొంత కాలంగా సిఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వం, బిజెపిలపై కత్తులు దూస్తునందున, రేపు ప్రధానికి స్వాగతం చెప్పడానికి వెళ్ళడం లేదు. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం, వీడ్కోలు చెప్పాలని నిర్ణయించారు. ఈ మేరకు సిఎం కార్యాలయం ఒక నోట్ విడుదల చేసింది. 



ప్రధాని నరేంద్రమోడీ రేపు పటాన్‌చెరులో ఇక్రిశాట్ సంస్థ 50వ వార్షికోత్సవాలను ప్రారంభిస్తారు. తరువాత ముచ్చింతల్ వద్ద నిర్మించిన సమతా స్పూర్తి కేంద్రానికి వెళ్ళి అక్కడ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇష్టం లేకనే సిఎం కేసీఆర్‌ గురువారమే సమతా స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారనుకోవాలేమో?ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి వచ్చే ముందు సిఎం కేసీఆర్‌ ఆయనపై...ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో ఈ ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని భావించవచ్చు. 



Related Post