తెలంగాణ బాటలో ఆంధ్రప్రదేశ్‌...26 జిల్లాలు ఏర్పాటు

January 26, 2022


img

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నిన్న కూకట్‌పల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తరువాత మాట్లాడుతూ, “నేడు తెలంగాణ ఏమి చేస్తుందో... రేపు యావత్ దేశం దానిని ఆచరిస్తుంది. యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది,” అని అన్నారు. ఈ మాట అక్షరాల నిజమని నిరూపిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా 13 జిల్లాలను పునర్విభజన చేసి 26 జిల్లాలుగా మార్చేందుకు నిన్న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ నిన్న నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై ఫిబ్రవరి 26వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. ఆ తరువాత ప్రజాభిప్రాయాల మేరకు అవసరమైన మార్పులు, చేర్పులు చేసి తుది గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ (ఏప్రిల్ 2వ తేదీ) నుంచి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలు: 

1. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం (మన్యం) జిల్లా. 

2. విశాఖ జిల్లాలోని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా. 

3. అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా. 

4. కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా. 

5. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా.

6. రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా. 

7. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా.   

8. ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా. 

9. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా.

10. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా. 

11. గుంటూరు జిల్లాలోగల నరసరావుపేట కేంద్రంగాపల్నాడు జిల్లా. 

12. బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా.

13. తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా. 

14. రాయచోటి కేంద్రంగా శ్రీ అన్నమ్మయ్య జిల్లా. 

15. రాప్తాడు కేంద్రంగా అనంతపురం జిల్లా. 

16. నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా. 

17. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి బాబా జిల్లా.  

ఇవి కాక ప్రస్తుతం ఉన్న జిల్లాలు :

18. శ్రీకాకుళం కేంద్రంగా శ్రీకాకుళం జిల్లా. 

19. విజయనగరం కేంద్రంగా విజయనగరం జిల్లా.   

20. విశాఖపట్నం కేంద్రంగా విశాఖ జిల్లా. 

21. గుంటూరు కేంద్రంగా గుంటూరు జిల్లా. 

22. ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా.  

23. నెల్లూరు కేంద్రంగా పొట్టి శ్రీరాములు జిల్లా. 

24. చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా. 

25. కడప కేంద్రంగా వైఎస్సార్ జిల్లా. 

26. కర్నూలు కేంద్రంగా కర్నూలు జిల్లా. 


Related Post