రాష్ట్రంలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే అధికారి ఎవరూ అంటే టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్ అని చెప్పకతప్పదు. పాలే నిషా అనే ఓ మహిళ మంగళవారం అర్ధరాత్రి వీసి సజ్జనార్‌కు ఓ ట్వీట్ చేసింది. రాత్రిపూట దూర ప్రాంతాలకు బస్సులలో ప్రయాణించే మహిళలు టాయిలెట్‌కు వెళ్ళేందుకు దారిలో పెట్రోల్ బంకుల వద్ద బస్సులను 10 నిమిషాలు ఆపాలని ఆమె ట్వీట్ చేసింది.
సాధారణంగా డ్యూటీలో ఉన్నప్పుడే చాలా మంది అధికారులు తమ ఎదురుగా నిలబడి ఉన్న ప్రజలను పట్టించుకోరు. కానీ వీసి సజ్జనార్ మాత్రం అర్దరాత్రి ఆ మెసేజ్ చూడటమే కాకుండా వెంటనే అధికారులను ఆదేశించినట్లు ఆమెకు ట్విట్టర్ ద్వారానే జవాబు ఇచ్చారు.
ఆమె రాత్రి 11.08 గంటలకు ఈ ట్వీట్ చేయగా, వీసి సజ్జనార్ వెంటనే సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, ఆ తరువాత 11.15 గంటలకు అంటే ఏడు నిమిషాల తరువాత ఆమెకు సంతృప్తికరమైన సమాధానం చెప్పారు. అంత రాత్రిపూట కూడా వీసి సజ్జనార్ స్పందించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకున్నారు.