గెలుపు దిశలో ఈటల?

November 02, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చాలా చురుకుగా సాగుతోంది. మొత్తం 22 రౌండ్లలో ఇప్పటివరకు 14 రౌండ్స్ పూర్తయ్యాయి. 14వ రౌండ్‌ లెక్కింపు ముగిసేసరికి ఈటల రాజేందర్‌కు టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 9,434 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో మొత్తం 2,05,236 ఓట్లు పోల్ అవగా ఇప్పటివరకు వాటిలో 1,17,199 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా 88,037 ఓట్లు లెక్కించవలసి ఉంది. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొన్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఈటల రాజేందర్‌ ఆధిక్యతతో కొనసాగుతున్నారు కనుక మిగిలిన 8 రౌండ్లలో కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంది. కనుక ఈ ఉపఎన్నికలొ ఈటల రాజేందర్‌ 10 వేల లోపు ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ మిగిలిన ఈ 8 రౌండ్లలో టిఆర్ఎస్‌ పుంజుకొన్నట్లయితే స్వల్ప మెజార్టీతో గెలవవచ్చు తప్ప భారీ మెజార్టీ సాధించడం అసాధ్యమే అని స్పష్టం అయ్యింది.     



Related Post