పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే

October 29, 2021


img

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి ఏడేళ్ళయినా సాగునీటి పంపకాలు, ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మద్య వివాదాలు సమసి పోలేదు. నానాటికీ అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కీచులాడుకొంటుంటే, కేంద్రప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై ఉన్న సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తీసుకురావడంతో ఈ కయ్యాలలో పాల్గొనేవారి సంఖ్యను ఇంకా పెంచినట్లయింది. రెండు రాష్ట్రాల మద్య ఉన్న సమస్యలే ఇంకా పరిష్కారానికి నోచుకోలేకపోతుంటే తాజాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్‌జీటీ (నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యూనల్) స్టే విధించడం మరో కొత్త వివాదానికి శ్రీకారం చుట్టినట్లయ్యింది. 

ఈ ప్రాజెక్టును త్రాగునీటి కోసం నిర్మిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని కానీ సాగునీటి అవసరాలు తీరే విదంగా నిర్మాణాలు చేపట్టిందని కనుక అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కోరుతూ చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్‌జీటీలో ఓ పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ చేపట్టిన ఎన్‌జీటీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టును నిర్మించరాదని తీర్పులో పేర్కొంది. 


Related Post