జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు తరచూ సామాన్య ప్రజలపై దాడులు చేస్తుండటంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా చాలా స్పందిస్తూ, “జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులను మేము చూస్తూ ఊరుకొంటామని అనుకోవద్దు. మా సహనం నశిస్తే మళ్ళీ పాక్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదుల శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి వెనకాడము. గత యూపీఏ ప్రభుత్వంలాగా మేము చేతులు ముడుచుకొని కూర్చోబోమని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాం. ఇదివరకు ఇటువంటి సందర్భాలలో పాక్ పాలకులకు హెచ్చరిక సందేశాలు పంపేవారిమి. ఇప్పుడు అటువంటివేవీ ఉండవు... నేరుగా ఎదురుదాడి చేస్తాం,” అని అన్నారు. గురువారం గోవాలో దర్భందోరాలో నేషనల్ ఫోరెన్‌సిక్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాల్గొన్నప్పుడు పాక్ పాలకులకు ఈ తాజా హెచ్చరిక చేశారు.
అయితే పాకిస్థాన్ సర్జికల్ స్ట్రైక్స్ కు తప్ప ఇటువంటి హెచ్చరికలకు భయపడే రకం కాదని అందరికీ తెలుసు. కనుక పాక్ ఆగడాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. కనుక భారత్‌కు పక్కలో బల్లెంలాగా తయారైన చైనా, పాకిస్థాన్‌లను, వాటి ఆగడాలను ఎప్పటికీ భరించక తప్పదు కూడా.