చిన్నారులకు కరోనా టీకాలు సిద్దం

October 12, 2021


img

భారత్‌లో ఇప్పటి వరకు 18 ఏళ్ళ పైబడినవారికే కరోనా సోకకుండా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై రెండేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ళ వారి వరకు అందరికీ టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్‌ను చిన్నారులకు వినియోగించేందుకు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. దీనిని పరిమిత శంఖ్యలో అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపింది.  

అలాగే పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాలో ఉత్పత్తి అవుతున్న కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్ళ లోపువారిపై జరిపిన క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతం కావడంతో ఆ నివేదికలను కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. బహుశః త్వరలోనే దానికీ అనుమతి లభించవచ్చు. అప్పుడు చిన్న పిల్లల కోసం ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి. 

కరోనా సృష్టించిన విధ్వంసం చూసిన తరువాత తల్లితండ్రులు తమ పిల్లలను స్కూళ్ళకు పంపించేందుకు జంకుతున్నారు. ఆ కారణంగా వారు చదువులలో వెనుకబడిపోతున్నారు. కనుక ఈ రెండు వాక్సిన్లు అందుబాటులోకి వస్తే పిల్లలకు చాలా మేలు కలుగుతుంది.


Related Post