'మా' ఎలక్షన్స్.. ఓడింది ప్రకాష్ రాజ్ మాత్రమే కాదు..!

October 12, 2021


img

దాసరి తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తున్నారు. ప్రతి సినిమా ఈవెంట్ కు వస్తూ యంగ్ జెనరేషన్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. అయితే బయటకు చెప్పినా చెప్పకపోయినా లోపల వర్గ పోరు ఉందని అప్పుడప్పుడు తలపించే టాలీవుడ్ లో చిరు డెశిషన్ ఫైనల్ అవుతుందని అనుకోవడం పొరపాటే.

ఇదే విషయం మా ఎలక్షన్స్ ఫలితాలతో మరోసారి వెల్లడి అయ్యింది. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ కోసం తనని తప్పుకోమని తన తండ్రికి చిరంజీవి అంకుల్ కాల్ చేశారని చెప్పాడు. మా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం చేద్దామని అనుకోగా మంచు బాబు వెనక్కి తగ్గేది లేదని చెప్పడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇక మెగా కాంపౌండ్ సపోర్ట్ తో బరిలో దిగిన ప్రకాష్ రాజ్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాని తెలుగు వాదంతో ప్రకాష్ రాజ్ మీద ఎటాక్ చేశారు ప్రత్యర్ధులు. దానికితోడు ఇండస్ట్రీలో కొందరు తెలుగు వాళ్లు మా అధ్యక్ష పదవికి పనికిరారా అంటూ మంచు విష్ణుకి సపోర్ట్ గా నిలిచారు. అక్కడే మంచు విష్ణు గెలుపు ఖాయమైంది.

అయితే గెలిచిన విష్ణు బాబు ప్రకాష్ రాజ్ ని నిలబెట్టింది చిరంజీవే.. ఆయన్ని ఏకగ్రీవం చేద్దమని అనుకున్నారు. చరణ్ కూడా తనకు ఓటు వేసి ఉండరు లాంటి మాటలు.. ఇక్కడ ఓడింది ప్రకాష్ రాజ్ మాత్రమే కాదు మెగా కాంపౌండ్ మొత్తం అన్న అర్ధం వచ్చేస్తుంది. మా ఎలక్షన్స్ ఫలితాల రోజే ఓ ఈవెంట్ లో పదవి కోసం మనల్ని మనం కించపరచుకోవడం.. గొడవలు పడటం కరెక్ట్ కాదని చిరంజీవి చెప్పారు. ఇక తనయుడు గెలిచిన ఆనందంలో అన్ని చూస్తున్నా.. భరిస్తున్నా.. ఓపికగా ఉన్నా.. సిం హం నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే భయపడ్డట్టు కాదని మోహన్ బాబు ఇన్ డైరెక్ట్ గా మెగాస్టార్ కు కౌంటర్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. 

మొత్తానికి మా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినా ఇండస్ట్రీలో ఈ గొడవలకు మాత్రం ఇప్పుడప్పుడే ఎండ్ కార్డ్ పడేలా లేదని మాత్రం అర్ధమవుతుంది. Related Post