భారత్‌కు కీలకం కానున్న మోడీ-బైడెన్‌ భేటీ

September 23, 2021


img

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలైనప్పటికీ కరోనా కారణంగా ప్రధాని నరేంద్రమోడీ, జో బైడెన్‌ ఇంతవరకు ప్రత్యక్షంగా సమావేశం కాలేకపోయారు. కనుక జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ముఖాముఖి సమావేశం కావడం ఇదే మొదటిసారి. కనుక వారి సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. 

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. కనుక ఈ సమయంలో అమెరికా సహాయసహకారాలు, బలమైన వాణిజ్య సంబంధాలు, ఎగుమతులు, పెట్టుబడులు భారత్‌కు చాలా అవసరం. ఇప్పటివరకు చైనా, పాకిస్థాన్‌లు మాత్రమే భారత్‌కు పక్కలో పాముల్లా ఉన్నాయి. ఇప్పుడు తాలిబన్లు కూడా తయారయ్యారు. భారత్‌లో ముస్లింల తరపున పోరాడుతామని తాలిబన్లు చెప్పడం గమనిస్తే ఇప్పుడు వారితో కూడా భారత్‌కు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.    

కనుక తాలిబన్లను కట్టడి చేయడానికి, చైనా పాకిస్థాన్‌లను దౌత్యపరంగా కట్టడి చేయడానికి భారత్‌కు అమెరికా తోడ్పాటు చాలా అవసరం. 

అత్యంత సంక్లిష్టమైన వ్యక్తిత్వం కలిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ బాగానే స్నేహం కొనసాగించగలిగారు. కనుక భారత్‌-అమెరికాల మద్య సంబంధాలు బలపడ్డాయి. జో బైడెన్‌ భారత్‌ పట్ల సానుకూలంగానే ఉన్నారు కనుక ఆయనతో కూడా ప్రధాని నరేంద్రమోడీకి సఖ్యత కుదిరితే భారత్‌కు చాలా మేలు కలుగుతుంది. 


Related Post