ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరిస్తే వారి పరిస్తితి ఏమిటి? భట్టి ప్రశ్న

March 02, 2021


img

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈరోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ఏర్పడితే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కేసీఆర్‌ ఇద్దరూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. అలాగయితే బడుగుబలహీనవర్గాలకు ఇక ఉద్యోగాలు ఎలా వస్తాయి?” అని ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కూడా భట్టి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “సిఎం కేసీఆర్‌ స్వయంగా ఏర్పాటుచేసిన పీఆర్సీ కమీషన్ రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలున్నాయని నివేదిక ఇచ్చింది. కానీ మంత్రి కేటీఆర్‌ ఖాళీలు, ఉద్యోగాల భర్తీపై తప్పుడు లెక్కలు చెపుతూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ ఒక్కలాగే వ్యవహరిస్తున్నాయి. కనుక ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు ఆ రెండు పార్టీలకు తాగింవిదంగా గుణపాఠం చెప్పాలి,” అని అన్నారు. 

భట్టి విక్రమార్క వాదనలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఒకవేళ ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ ప్రయివేటీకరణ చేస్తే, అప్పుడు రిజర్వేషన్లు ఉన్నా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా బడుగుబలహీనవర్గాలు మిగిలినవారితో పోటీ పడవలసి ఉంటుంది. లేకుంటే అవి కూడా వారికి దక్కవు. కనుక ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణతో సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.


Related Post