ఆ రోజు ఏమి జరిగిందంటే...

February 27, 2021


img

సరిగ్గా రెండేళ్ళ క్రితం అంటే...ఫిబ్రవరి 2019లో భారత్‌ వాయుసేనకు చెందిన పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్‌ యుద్ధవిమానాలను తరుముకొంటూ వెళ్ళి ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చేశాడు. ఆ తరువాత ఎదురుదాడిలో ఆయన నడుపుతున్న మిగ్-21 యుద్ధవిమానం పాక్‌ భూభాగంలో కూలిపోవడంతో పాక్‌ సైనికులకు బందీగా చిక్కాడు. సాధారణంగా పాక్‌ చేతికి చిక్కినవారెవరూ ప్రాణాలతో బయటపడరు పైగా చనిపోయేవరకు చిత్రహింసలు కూడా భరించాల్సి ఉంటుంది. కానీ పాక్‌ ప్రభుత్వం అభినందన్ వర్ధమాన్‌ను కేవలం 60 గంటలలోనే క్షేమంగా భారత్‌కు అప్పగించింది. ఇరుదేశాల మద్య శాంతి నెలకొల్పాలనే సదుదేశ్యంతో అప్పగించమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ చెప్పారు. కానీ ఆరోజు తెర వెనుక జరిగిన కధ ఇప్పుడు మెల్లగా బయటకు వచ్చింది.

ప్రధాని నరేంద్రమోడీ సూచన మేరకు రీసర్చ్ అండ్ అనాలసిస్ చీఫ్ అనిల్ థస్‌మనా నేరుగా ఐఎస్‌ఐ లెఫ్టినెంట్ గవర్నర్‌ సయ్యద్ అసీమ్ మున్నీర్‌కు హాట్ లైన్ కాల్ చేసి అభినందన్ వర్ధమాన్‌కు హాని తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని కనుక తక్షణమే క్షేమంగా అప్పగించాలని హెచ్చరించారు. ఈ మేరకు ఓ రహస్యలేఖను కూడా పంపడంతో ఈ పరిణామం ఊహించని పాక్‌ పాలకులు కంగు తిన్నారు. భారత్‌తో యుద్ధానికి సిద్దంగా ఉన్నామని, అవసరమైతే భారత్‌పై అణుబాంబులతో దాడి చేసి ప్రపంచపఠంలో కనబడకుండా చేస్తామంటూ అనేక ప్రగల్భాలు పలికిన పాక్‌ పాలకులు, పాక్‌ సైనికాధికారులు భారత్‌ హెచ్చరికలతో భయపడుతూనే మళ్ళీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ శాంతియుత వాతావరణం నెలకొల్పడానికే అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగిస్తున్నామని చెప్పుకొన్నారు. భారత్‌-పాక్‌ వాస్తవ బలాబలాలకు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

అయితే రెండేళ్ళ తరువాత ఇప్పుడు ఈ విషయం ఎందుకు మీడియాకు లీక్ చేశారు? అంటే అది రాజకీయం అవుతుంది.


Related Post