బిజెపి ఆరాటం...ప్రాంతీయపార్టీల పోరాటం

February 26, 2021


img

త్వరలో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరుగవలసి ఉంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలపై పూర్తిపట్టు సాధించిన బిజెపి, ఈసారి ప్రధానంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో గెలిచి తన కాషాయ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని పట్టుదలగా ఉంది. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి బిజెపిని అడుగుపెట్టనీయకూడదని పట్టుదలగా పోరాడుతోంది.

ఇక తమిళనాడులో కమల్ హాసన్‌, స్టాలిన్ (ప్రధాన ప్రతిపక్షపార్టీ డీఎంకె అధినేత), శశికళ ముగ్గురూ కూడా ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఉన్నారు. అధికార అన్నాడీఎంకెతో చేతులు కలిపి తమిళనాడులో కూడా అడుగుపెట్టాలని బిజెపి తహతహలాడుతోంది. కనుక తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగనున్నాయి.    

అలాగే కేరళలో దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ కూటమి, వామపక్షాల కూటమిల మధ్య అధికార మార్పిడి జరుగుతోంది తప్ప వేరే పార్టీలకు అవకాశం లభించడంలేదు. ఈసారి మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను ముందుంచి కేరళలో అడుగుపెట్టాలని బిజెపి తహతహలాడుతోంది. ఈవిదంగా బిజెపి మెల్లగా ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతుంటే, తమ అధికారం నిలుపుకోవాలని ప్రాంతీయ పార్టీలు దానితో పోరాడుతున్నాయి. కనుక ఈ ఎన్నికలలో బిజెపి మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుందో లేదో చూడాలి. 


Related Post