కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం కారణంగా నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ వ్రాశారు.
పుదుచ్చేరిలో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వంలో ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడింది. దాంతో బలనిరూపణ చేసుకోవలసిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. కానీ సిఎం నారాయణస్వామి బలనిరూపణకు ముందే గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పుదుచ్చేరిలో ప్రతిక్ష పార్టీకి తగినంతమంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో వారు ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ వ్రాశారు. గవర్నర్ సిఫార్సు మేరకు నేడో రేపో ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.