సుభాష్ జయంతి...పరాక్రమ్ దివస్

January 19, 2021


img

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23ను "పరాక్రమ్ దివస్"గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రసాంస్కృతిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. సుభాష్ చంద్రబోస్ దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా వెనకాడని మహానీయుడని, ఆయనను ఈవిధంగా స్మరించుకుందామని తెలియజేసింది. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కోల్‌కతాలోని విక్టోరియా హాల్లో జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం(23) సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలకు హాజరవుతారని సమాచారం.

ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి కనుక అప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైపోయింది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌, బిజెపిల మద్య హోరాహోరీగా మాటల యుద్ధాలు, పార్టీ నేతల ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలిచి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి తహతహలాడుతోంది. బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే బెంగాలీ ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు వారి ఆరాద్య నాయకుడు సుబాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివస్‌గా ప్రకటించిందేమో?


Related Post