కేటీఆర్‌ ముందుకు ఖమ్మం టిఆర్ఎస్‌ పంచాయతీ?

January 19, 2021


img

ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్‌ నేతల మద్య విభేధాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. వైసీపీ నుండి టిఆర్ఎస్‌లో చేరిన తనను పార్టీలో కొందరు సీనియర్ నేతలు రాజకీయంగా దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించడంతో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. త్వరలో వరంగల్‌–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇటువంటి సమయంలో పార్టీ నేతల మద్య విభేధాలు తలెత్తడంతో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వాటిని అత్యవసరంగా పరిష్కరించక తప్పడం లేదు. ముందుగా ఇవాళ్ళ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కేటీఆర్‌ సమావేశమయ్యి ఈ సమస్యపై చర్చించారు. బుదవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యి వారి మద్య నెలకొన్న విభేధాలను పరిష్కరించిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నికలు...అభ్యర్ధి గురించి చర్చించనున్నారు. 



Related Post