వ్యవసాయ రంగానికి లక్షకోట్లు : నిర్మలా సీతారామన్

May 15, 2020


img

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం సాయంత్రం వ్యవసాయ అనుబంద రంగాలకు భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. ఆ వివరాలు:  

వ్యవసాయంలో మౌలిక వసతులు కల్పించడానికి రూ.లక్ష కోట్లు కేటాయింపు.  

 ఆ సొమ్ముతో  దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను నిలువచేసుకోవడానికి భారీ సంఖ్యలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం. 

గత 51 రోజులలో రైతుల ఖాతాలలో వేసిన సొమ్ము రూ.18,700 కోట్లు. 

ఈ సీజనులో రైతుల నుంచి రూ.74,300 కోట్లు విలువ చేసే ధాన్యాలు కొనుగోలు. 

పంటలకు మంచి ధర లభించేలా చేసేందుకు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకొనే విధంగా చట్ట సవరణ చేయబడుతుంది. 

రైతుల అత్యవసర నిధికి రూ.30,000 కోట్లు. దాంతో 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం. 

వ్యవసాయ అనుబందరంగాలకు వేర్వేరుగా నిధులు కేటాయింపు 

ఔషదమొక్కలు సాగుచేసేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు. వాటి సాగు కోసం రూ.4,000 కోట్లు నిధి. 

కూరగాయలు పండించే రైతులకు రూ. 5,000 కోట్లు. అవసరమైతే వాటిని కోల్డ్ స్టోరేజీలలో నిలువ చేసుకొనేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించబడుతుంది. 

వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు దళారులు, వ్యాపారులు నియంత్రించే విధానాలకు చెక్ పెట్టేందుకు 1955 అత్యవసర సరుకుల చట్టానికి సవరణలు చేయబడతాయి.  

2 కోట్ల మంది పాడి రైతులకు రూ.5,000 కోట్లు ఆర్ధిక సాయం. 

పశుసంవర్ధక రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.15,000 కోట్లు. 

మొత్తం 53 కోట్లు ఆవులు, గేదెలు, ఇతర జీవాలకు రూ.13,300 కోట్ల వ్యయంతో వ్యాక్సిన్లు 

చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ. 10,000 కోట్లు సహాయనిధి. దీంతో 2 లక్షల యూనిట్లకు ప్రయోజనం కలుగుతుంది.  

 స్థానిక ఉత్పత్తుల ఎగుమతికి రూ. 10,000 కోట్లు సహాయనిధి. ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా 55 లక్షల మందికి ఉద్యోగ కల్పన.

మత్స్యకారులకు భీమా సౌకర్యం.   

ప్రధాని మత్స్య యోజన పధకం కింద రూ.20,000 కోట్లు ప్రత్యేక నిధి. 

అక్వా రైతులకు రూ.11,000 కోట్లు

తేనెటీగల పెంపకందారులకు రూ. 5,000 కోట్లు నిధి.


Related Post