కరోనాతో కలిసి జీవించడం ఓ కళ: నితిన్ గడ్కరీ

May 14, 2020


img

కేంద్రప్రభుత్వంలో కీలకవ్యక్తిగా ఉన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుదవారం ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్ పుట్టుక గురించి భారత ప్రభుత్వం ఏమనుకొంటుందో చెప్పేశారు. “కరోనా సహజంగా పుట్టిందని అనుకోవడం లేదు. దానిని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించారు అందుకే ఇటువంటి విపరీత పరిణామాలను ఎవరూ ముందుగా అంచనా వేయలేకపోతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసేందుకు పలుదేశాలు కృషి చేస్తున్నాయి. కనుక అది అందుబాటులోకి వచ్చేవరకు కరోనాతో కలిసి జీవించడం ఒక కళగా భావించి నేర్చుకోక తప్పదు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు లాక్‌డౌన్‌ కొనసాగించలేము కనుక త్వరలోనే దేశంలో అన్ని రంగాలు మళ్ళీ పనిచేయవలసి ఉంటుంది. అందుకు ప్రజలు కూడా సిద్దం కావలసి ఉంటుంది. మరికొంతకాలం కరోనాతో కలిసి బ్రతకవలసి ఉంటుంది కనుక కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించడం అందరూ అలవరుచుకోవాలని ఆశిస్తున్నాను,” అని అన్నారు. 

కరోనా సృష్టి గురించి నితిన్ గడ్కరీ చెప్పిన మాటలను నిశితంగా గమనిస్తే శతృదేశాలపై దానిని ‘బయో వెపన్’గా ప్రయోగించేందుకు చైనా దానిని అభివృద్ధి చేస్తోందని అనుమానిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోలు కూడా చైనాపై ఇటువంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్‌ కూడా వారితో గొంతు కలిపి చైనాను గట్టిగా నిలదీసేందుకు సిద్దమవుతున్నట్లుంది.


Related Post