కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ

May 09, 2020


img

కరోనా రోగులు, కరోనా లక్షణాలతో క్వారెంటైన్‌లో చేరుతున్నవారికి పరీక్షలు, చికిత్స, డిశ్చార్జ్ లకు సంబందించి కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. 

1. కొద్దిగా కరోనా లక్షణాలతో క్వారెంటైన్‌ లేదా ఆసుపత్రులలో చేరినవారిలో వరుసగా మూడు రోజులపాటు జ్వరం రానట్లయితే ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే 10 రోజుల తరువాత డిశ్చార్జ్ చేయవచ్చు కానీ డిశ్చార్జ్ చేసే సమయానికి సదరు వ్యక్తిలో ఆక్సిజన్ సాచూరేషన్ కనీసం 95 శాతం ఉండాలి. డిశ్చార్జ్ అయిన తరువాత వారం రోజుల పాటు తప్పనిసరిగా హోమ్ క్వారెంటైన్‌లో ఉంచాలి. వారిని స్థానిక ఆరోగ్యశాఖ సిబ్బంది 14 రోజుల పాటు పర్యవేక్షించాలి.   

2. మద్యస్థ లక్షణాలతో జేరినవారిని వరుసగా 10 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. ఈ సమయంలో ఎటువంటి మందులు వాడకుండా మూడు రోజులపాటు జ్వరం రాకుండా, నాలుగు రోజులపాటు ఆక్సిజన్ సాచూరేషన్ 95 శాతం కంటే ఎక్కువ ఉండి, శ్వాస సంబందిత సమస్యలు లేనట్లయితే ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే10 రోజుల తరువాత ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేయవచ్చు. డిశ్చార్జ్ అయిన తరువాత వారంరోజుల పాటు తప్పనిసరిగా హోమ్ క్వారెంటైన్‌లో ఉంచాలి. వారిని 14 రోజులు పర్యవేక్షణ జాబితాలో ఉంచాలి. 

3. తీవ్ర లక్షణాలతో ఆసుపత్రులలో చేరినవారిని పూర్తిగా నయమయ్యేవరకు ఆసుపత్రులలోనే ఉంచి చికిత్స అందిస్తూ, ఆర్‌టీ-పీపీఆర్ పరీక్షలు నిర్వహించి కరోనా లేదని నిర్ధారించుకొన్న తరువాతే డిశ్చార్జ్ చేయాలి.


Related Post