రాష్ట్రంలో మళ్ళీ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద హడావుడి

May 07, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా గత నెలన్నరరోజులుగా అన్ని ప్రభుత్వం ప్రైవేట్ కార్యాలయాలు మూతపడటంతో జనజీవనం దాదాపు స్తంభించిపోయింది. అయితే ఇటీవల ప్రభుత్వం గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో ఆంక్షలు సడలించడంతో మళ్ళీ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద ఆస్తులు, కొనుగోలు, అమ్మకాలు చేసేవారితో కోలాహలంగా మారాయి. 

గత 5 రోజులలో రాష్ట్రవ్యాప్తంగా సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులలో 627 ఆస్తుల లావాదేవీలు జరుగగా, బుదవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 644 జరిగాయి. డాక్యుమెంట్ రైటర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆన్‌లైన్‌ (పబ్లిక్ డాటా ఎంట్రీ విధానం) ద్వారా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకొంటున్నారు. లాక్‌డౌన్‌ వచ్చిన మార్పులలో ఇదీ ఒకటని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఈవిధంగా 1,431 దరఖాస్తులు రాగా, ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్లు జరుపుకొనేందుకు మరో 1,100 మంది దరఖాస్తు చేసుకొన్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు మెల్లగా సడలిస్తున్నందున రాబోయే వారం పది రోజులలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగవచ్చని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు.      

రాష్ట్ర రవాణాశాఖ (ఆర్టీఓ)లో కూడా ఆన్‌లైన్‌ ద్వారా పరిమిత సంఖ్యలో స్లాట్స్ బుక్‌ చేసుకొనేందుకు అనుమతించడంతో ఆ శాఖలో కూడా రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే సామాజిక దూరం పాటించడం, మాస్కూలు ధరించడం వంటినిబందలన్నీ యధాతధంగా అమలుచేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. 

రిజిస్ట్రేషన్స్, రవాణాశాఖలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చేవే కనుక ఆ కార్యాలయాలు తెరుచుకోవడం చాలా శుభపరిణామంగానే భావించవచ్చు.  


Related Post