మరో భారీ తరలింపుకు సిద్దపడుతున్న భారత్‌

May 05, 2020


img

విదేశాలలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా, యూకె, సింగపూర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్, బంగ్లాదేశ్ తదితర దేశాలలో చిక్కుకుపోయిన 14,800 మందిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు 64 విమానాలు, నావికాదళానికి చెందిన మూడు యుద్ధ నౌకలను పంపిస్తోంది. ఈ గురువారం నుంచి వారి తరలింపు కార్యక్రమం మొదలవుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. దేశంలో వారు చేరుకోవలసిన రాష్ట్రాలను బట్టి వారిని డిల్లీ, ముంబై, కొచ్చి, లక్నో విమానాశ్రయాలకు చేరుస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. 

యుద్ధనౌక జలాశ్వలో యూఏఈ నుంచి సుమారు 1,000 మందిని, ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌, ఐఎన్‌ఎస్‌ మగర్‌ యుద్ధనౌకాలలో మాల్దీవుల నుంచి 300 మంది చొప్పున తీసుకురాబోతున్నామని తెలియజేసింది. ఈ మూడు నౌకలు సోమవారం రాత్రి బయలుదేరి వెళ్ళాయి.


Related Post