గ్రీన్‌కార్డ్, హెచ్-1బీ వీసాలకు 60 రోజులు గడువు

May 02, 2020


img

అమెరికాలో హెచ్-1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకొంటున్నవారికి, శాస్విత నివాసం కోసం దరఖాస్తు చేసుకొన్నవారికి అమెరికా ప్రభుత్వం ఓ శుభవార్త ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా గడువు ముగుస్తున్న హెచ్-1బీ వీసాలకు సంబందించి అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజులు గడువు ఇస్తున్నట్లు యుఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సీఐఎస్) తెలియజేసింది. ఇక గ్రీన్‌ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకొన్నవారికి కూడా60 రోజులు గడువు ఇస్తున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు శుక్రవారం యుఎస్‌సీఐఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది హెచ్-1బీ వీసాల కోసం ఎదురుచూస్తుండగా, సుమారు 2.5 లక్షల మంది గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. కనుక హెచ్-1బీ వీసాలు , గ్రీన్ కార్డుల కోసం 60 రోజులలోగా అన్ని పత్రాలతో కూడిన దరఖాస్తులను సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే గడువు ముగిసినవారు 60 రోజులలోగా ఫారం ఐ-290ని సమర్పించాలని, వాటి ఆధారంగా తగిన నిర్ణయం తీసుకొంటామని యుఎస్‌సీఐఎస్ తెలిపింది.



Related Post