తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతుంటే ఏపీలో పెరుగుతున్నాయేమిటో?

May 02, 2020


img

తెలంగాణలో కరోనా మహమ్మారి దాదాపు నియంత్రణలోకి వస్తున్న తరుణంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకి కనీసం 60 కేసులు నమోదవుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయమే. అయితే తమ ప్రభుత్వం దేశంలోకెల్లా అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్నందునే ఇన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయని, తెలంగాణతో సహా ఇరుగుపొరుగు రాష్ట్రాలలో నామమాత్రపు పరీక్షలు నిర్వహిస్తున్నందునే కరోనా కేసులు బయటపడటం లేదని అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా వంటి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని, ముస్లింలను ప్రసన్నం చేసుకొనేందుకే తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయడంలేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ తమ ప్రభుత్వం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే కరోనా పరీక్షలను నిర్వహిస్తోందని, కరోనా కేసులను తగ్గించి చూపవలసిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కారణాలు ఏవైతేనేమి, తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతుంటే ఏపీలో రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  

గడిచిన 24 గంటలలో 5,943 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 62 పాజిటివ్ అని తేలింది. వాటితో కలిపి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,525కి చేరింది. ఇప్పటివరకు 441 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా మరో 1,051 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 33 మంది మరణించారని ఏపీ ఆరోగ్యశాఖ తెలియజేసింది.    

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం 13 జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఈవిధంగా ఉంది: 

జిల్లా

పాజిటివ్

22/4

పాజిటివ్

  24/4

పాజిటివ్

  1/5

కొత్త కేసులు

పాజిటివ్

2/5

డిశ్చార్జ్

2/5

మృతులు

2/5

శ్రీకాకుళం

0

0

5

0

5

0

0

విజయనగరం

0

0

0

0

0

0

0

విశాఖ పట్నం

21

22

25

4

29

20

0

తూర్పుగోదావరి

26

34

42

3

45

17

0

పశ్చిమ గోదావరి

39

39

58

1

59

26

0

కృష్ణా

86

102

246

12

258

44

8

గుంటూరు

177

206

306

2

308

97

8

ప్రకాశం

48

53

60

1

61

42

0

కడప

51

51

79

4

83

37

0

కర్నూలు

203

261

411

25

436

66

10

నెల్లూరు

67

68

84

6

90

44

3

చిత్తూరు

59

73

80

0

80

24

0

అనంతపురం

36

46

67

4

71

24

4

మొత్తం

813

955

1,463

62

1525

441

33


Related Post