విద్యార్దులు, వలస కార్మికులను తరలించేందుకు ఆరు శ్రామిక్ రైళ్లు

May 01, 2020


img

దేశంలో వివిద రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్దులు, పర్యాటకులను వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకుగాను రైల్వేశాఖ శ్రామిక్ రైల్‌ పేరిట ఆరు ప్రత్యేక రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నేటి నుంచి వాటిని నడిపించడం మొదలుపెట్టింది. అయితే దేశవ్యాప్తంగా లక్షలాది మందిని తరలించవలసి ఉంది కనుక రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు రానున్న రోజులలో మరిన్ని రైళ్ళను నడిపించే అవకాశం ఉంది.

నేటి నుంచి ప్రారంభమైన రైళ్ల వివరాలు: 

1. లింగంపల్లి నుంచి హతియా

2. అలువా నుంచి భువనేశ్వర్

3. నాసిక్ నుంచి లక్నో

4. నాసిక్ నుంచి భోపాల్ 

5. జైపూర్ నుంచి పాట్నా

6. కోటా నుంచి హతియా


Related Post