వలస కార్మికుల తరలింపు షురూ

May 02, 2020


img

లాక్‌డౌన్‌తో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా రైల్వే సర్వీసులు బంద్‌ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ మొట్టమొదటిసారిగా శుక్రవారం హైదరాబాద్‌లో లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి 1,100 మంది వలస కార్మికులను తీసుకొని ఝార్ఖండ్‌లోని హాతియాకు బయలుదేరింది. వలస కార్మికులను బస్సులలో తరలించాలని కేంద్రప్రభుత్వం సూచించగా బస్సులలో కంటే రైళ్లలో తరలించడమే సురక్షితమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు రైల్వేశాఖ హైదరాబాద్‌ నుంచి ఝార్ఖండ్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. మే3 తరువాత లాక్‌డౌన్‌ మరో రెండు మూడు వారాలు పొడిగించే అవకాశం ఉంది గనుక ఇతర రాష్ట్రాలలో చిక్కుకొన్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. 



Related Post