ఏపీ, తెలంగాణలో రెడ్‌జోన్‌ జిల్లాలు ఇవే..

May 01, 2020


img

దేశంలో వివిద రాష్ట్రాలలో జిల్లాలువారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌ జోన్‌లను ప్రకటించింది. కరోనారహితంగా (గ్రీన్‌జోన్‌) 319 జిల్లాలు, కొన్ని కేసులు నమోదైన (ఆరెంజ్‌ జోన్‌) 284 జిల్లాలు, ఎక్కువ కేసులు నమోదైన (రెడ్‌ జోన్‌) 130 జిల్లాలు ఉన్నట్లు ప్రకటించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 19, మహారాష్ట్రలో 14, తమిళనాడులో 12, డిల్లీలో 11, పశ్చిమ బెంగాల్‌లో 10 రెడ్‌జోన్‌ జిల్లాలు ఉన్నట్లు ప్రకటించింది. 

రెండు తెలుగు రాష్ట్రాలలో రెడ్, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ జిల్లాల వివరాలు: 

తెలంగాణ: 

రెడ్ జోన్ జిల్లాలు:  హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్‌ అర్బన్.        

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: నిజామాబాద్‌, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మేదక్, జనగాం, నారాయణపేట.  

గ్రీన్‌ జోన్‌ జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, ములుగు, సిద్ధిపేట, వరంగల్‌ రూరల్, పెద్దపల్లి, వనపర్తి, నాగర్ కర్నూల్.  

ఆంధ్ర ప్రదేశ్: 

రెడ్‌జోన్‌ జిల్లాలు: కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు. 

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, అనంతపురం. 

గ్రీన్‌ జోన్‌ జిల్లా: విజయనగరం.      


Related Post