ఆ రెండు రాష్ట్రాలకు వెళ్ళొద్దు: తెలంగాణ ప్రభుత్వం

May 01, 2020


img

తెలంగాణకు పొరుగునే ఉన్న ఏపీ, మహారాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆ రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాలలో ఉన్న గద్వాల, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ వారు వైద్యం లేదా ఇతర అత్యవసరమైన పనులకు కూడా ఆ రెండు రాష్ట్రాలకు వెళ్ళవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే అన్ని రాష్ట్రాల మద్య రాకపోకలు స్తంభించాయి. అయినప్పటికీ సరిహద్దు జిల్లాలలో ప్రజలు పొరుగు రాష్ట్రానికి నిత్యం ఏదో పనిమీద వెళ్ళివస్తుంటారు. ఇక నుంచి ఆ రాకపోకలను నిషేధించడమే కాక దానిని ఖచ్చితంగా అమలుచేసేందుకు సరిహద్దు జిల్లాలో అధనంగా పోలీసులను కూడా మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఏపీలో కరోనా ఉదృతి చూసి తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఆ జిల్లా సరిహద్దులో కొన్ని ప్రాంతాలలో జిల్లా అధికారులు దగ్గరుండి రోడ్లకు అడ్డంగా గోడలు కట్టిస్తున్నారు. 



Related Post