ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకొంటే ఎలా? తలసాని

April 30, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా వివిద రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడంపట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, “వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలనుకోవడం మంచిదే కానీ కేంద్రప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకొని రైళ్లలో తరలించి ఉంటే బాగుండేది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ తక్షణం స్పందించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.  

వేలాదిమందిని బస్సులలో తరలించడం భారీ ఖర్చు, శ్రమతో కూడుకున్నవే. బస్సులలో సామాజిక దూరం పాటించే అవకాశం ఉండదు పైగా మార్గమద్యలో ఎక్కడ పడితే అక్కడ ఆగవలసి వస్తుంటుంది. కనుక వలస కార్మికులకు కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. కనుక కేంద్రప్రభుత్వం రైళ్లను ఏర్పాటు చేసి మద్యలో ఎక్కడా ఆపకుండా నేరుగా వారిని స్వస్థలాలకు తరలించగలిగితే వారు మరింత త్వరగా, సురక్షితంగా తమ తమ ఇళ్లకు చేరుకోగలరు. 

విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా కరోనా వైరస్ మొదటిసారి భారత్‌లోకి ప్రవేశించింది. ఆ తరువాత డిల్లీ మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారి ద్వారా రెండోసారి వ్యాపించింది. ఈ తరలింపు కార్యక్రమంలో వలస కార్మికులకు ఒకవేళ కరోనా సోకినట్లయితే అది మూడోసారి అవుతుంది. అదేకానుక జరిగితే అప్పుడు కరోనా వైరస్ పదిరెట్లు వేగంతో దేశమంతటా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఆ మహమ్మారిని ఎదుర్కోవడం భారత్‌కు చాలా కష్టమవుతుంది. కనుక తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్నట్లు రైళ్ళలోనే వలస కార్మికులను నేరుగా వారి స్వస్థలాలకు తరలించడం అన్ని విధాలా మంచిది.


Related Post