మహారాష్ట్రలో శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

April 29, 2020


img

దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఒక్క మహారాష్ట్రలోనే శరవేగంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈరోజు వరకు మహారాష్ట్రలో 9,318 కేసులు నమోదు కాగా వారిలో 1,388 మంది కోలుకొన్నారు. మిగిలినవారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు...ఇప్పటి వరకు 400 మంది మరణించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే 6,169 కేసులు నమోదు కాగా పూణేలో 1,174, ముంబైకి సమీపంలో గల థానే జిల్లాలో 824 కేసులు నమోదు అయ్యాయి. 

మహారాష్ట్ర తరువాత స్థానంలో నిలిచిన గుజరాత్‌లో 3,774 కేసులు నమోదయ్యాయి. వారిలో 434 మంది కోలుకోగా 3,159 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 181 మంది మరణించారు  

 మహారాష్ట్ర తరువాత స్థానంలో నిలిచిన డిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 3,314 కేసులు నమోదు కాగా 1,078 మంది కోలుకొన్నారు. మరో 2,182 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 54 మంది మరణించారు  

తరువాత స్థానాలలో మధ్యప్రదేశ్ (2,347), రాజస్థాన్ (2,383) తమిళనాడు(2,058), ఉత్తరప్రదేశ్ (2,053), ఆంధ్రప్రదేశ్(1,259), తెలంగాణ (1,009) రాష్ట్రాలు నిలుస్తున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్ రాష్ట్రలో అత్యధికంగా 120 మంది కరోనాతో చనిపోయారు. ఏపీలో 31, తెలంగాణలో 25 మంది కరోనాకు బలైయ్యారు.

 ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 31,408కి చేరింది. లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడే కరోనా కేసులు ఇంతగా పెరిగిపోతుంటే లాక్‌డౌన్‌ పూర్తిగా లేదా పాక్షికంగా ఎత్తివేస్తే ఏమవుతుందో ఊహించుకోవచ్చు. అయితే దేశంలో 10 ప్రధాన నగరాలలోనే కరోనా కేసుల పెరుగుతున్నట్లు కేంద్రప్రభుత్వం గుర్తించింది. వాటి వలననే జాతీయస్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించింది. కనుక ఆ 10 నగరాలలో కరోనాను కట్టడి చేయగలిగితే జాతీయస్థాయిలో కరోనా కేసులు కూడా తగ్గుతాయని భావిస్తోంది. కనుక 10 నగరాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 


Related Post