త్వరలో కరోనా నుంచి తెలంగాణకు విముక్తి

April 28, 2020


img

త్వరలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా నుంచి విముక్తి పొందబోతోందని సిఎం కేసీఆర్‌ చెప్పారు. సోమవారం ప్రధాని నరేంద్రమోడీతో వీడియో సమావేశంలో పాల్గొన్న తరువాత ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతికుమారి, జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో 10 జిల్లాలలో ఒక్క కరోనా కేసు కూడా  లేదని, 11 జిల్లాలలో ఏప్రిల్ 28వరకు కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. హైదరాబాద్‌, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లో మాత్రమే ఎక్కువ కేసులు నమోదయ్యాయని అవి కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయన్నారు.

రాష్ట్రం మొత్తం మీద నిన్న ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమే 2 కొట్టకేసులు నమోదు అయ్యాయన్నారు. కరోనా క్లస్టర్లు, హాట్ స్పాట్ జోన్లు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. త్వరలోనే తెలంగాణ కరోనారహిత రాష్ట్రంగా మారబోతోందన్నారు.

ఆ తరువాత అక్కడక్కడ కేసులు బయటపడినా లేదా కరోనా ఉదృతి మళ్ళీ పెరిగినా ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు, ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించడం వలననే ఇది సాధ్యమైందన్నారు. ఇక ముందు కూడా ప్రజలు ఇదేవిధంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 

ఒక్క కేసు కూడా లేని జిల్లాలు: 1. ములుగు, 2.భద్రాద్రి కొత్తగూడెం, 3.నారాయణపేట, 4.వరంగల్‌ రూరల్, 5.వనపర్తి, 6.నాగర్‌ కర్నూల్, 7.మహబూబాబాద్, 8.సిద్దిపేట, 9.యాదాద్రి భువనగిరి, 10.మంచిర్యాల. 

ఏప్రిల్ 28వరకు కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ జిల్లాలు: 1.జగిత్యాల, 2.జనగామ, 3.పెద్దపల్లి, 4.సంగారెడ్డి, 5.జయశంకర్‌ భూపాలపల్లి, 6.కామారెడ్డి, 7.మహబూబ్‌నగర్, 8.మెదక్, 9.రాజన్న సిరిసిల్ల, 10.కరీంనగర్, 11.నల్లగొండ.


Related Post